హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసు విచారణ
Advertisement
రాష్ట్ర చరిత్రలో ఓబుళాపురం గనుల కేసు ఎంతో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కేసు హైదరాబాద్ సీబీఐ కోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. వాదోపవాదాల సందర్భంగా, ఓబుళాపురం గనుల కేసును విశాఖ కోర్టుకు బదిలీ చేయాలని సీబీఐ కోరింది. ఇది అనంతపురం జిల్లాకు చెందిన అంశం కాబట్టి విశాఖకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేసింది. అయితే నిందితుల తరఫున న్యాయవాదులు సీబీఐ అభ్యర్థనను వ్యతిరేకించారు.

జీవోలన్నీ హైదరాబాద్ కేంద్రంగా జారీ అయ్యాయని నిందితుల న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో, తదుపరి వాదనలను అక్టోబరు 1న వింటామని సీబీఐ కోర్టు పేర్కొంది. కాగా, కోర్టు విచారణకు గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి హాజరుకాలేదు.
Tue, Sep 17, 2019, 07:40 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View