తెలంగాణలో బీజేపీ అధికారంలోకొస్తే ఎంఐఎంను మ్యూజియంలో పెడతాం: మురళీధర్ రావు
Advertisement
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఎంను మ్యూజియంలో పెడతామని ఆ పార్టీ అగ్రనేత మురళీధర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విమోచనా దినోత్సవం సందర్భంగా పటాన్ చెరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఎంఐఎంకు టీఆర్ఎస్ సర్కారు దాసోహమైందని మండిపడ్డారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడే సత్తా బీజేపీకే ఉందని అన్నారు. మజ్లిస్ పార్టీకి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు.

బీజేపీ ఓటుబ్యాంకు రాజకీయాలు చేయదు: కిషన్ రెడ్డి

మజ్లిస్ పార్టీ కనుసన్నల్లో టీఆర్ఎస్ పని చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. విమోచనా దినోత్సవాన్ని సీఎం కేసీఆర్ ఎందుకు నిర్వహించట్లేదని ప్రశ్నించారు. బీజేపీ ఓటుబ్యాంకు రాజకీయాలు చేయదని, 370 ఆర్టికల్ రద్దుతోనే జమ్మూకశ్మీర్ లో రాజ్యాంగం అమలవుతోందని అన్నారు.
Tue, Sep 17, 2019, 07:20 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View