కోడెల మరణం తర్వాత పరిస్థితులు క్షణక్షణానికి మారుతున్నాయి: బొత్స
Advertisement
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణంపై వ్యాఖ్యానించారు. కోడెల మృతి పట్ల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోడెల మరణం తర్వాత పరిస్థితులు క్షణక్షణం మారుతున్నాయని అన్నారు. కోడెల మృతిపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. పూర్తిస్థాయి విచారణ ద్వారానే వాస్తవాలు తెలుస్తాయని బొత్స అన్నారు. తమ ప్రభుత్వం కోడెలపై కేసులేమీ పెట్టలేదని బొత్స స్పష్టం చేశారు.
Mon, Sep 16, 2019, 04:12 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View