సీనియర్ నాయకుడు చనిపోయాడన్న బాధ లేకుండా మాపై బురదజల్లుతారా?: వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి
Advertisement
వైసీపీ ప్రభుత్వం వేధింపుల వల్లే ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య చేసుకున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీనియర్ నాయకుడు చనిపోయాడన్న బాధ కూడా లేకుండా టీడీపీ నేతలు తమపై బురదజల్లుతారా? అని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దని, ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదని టీడీపీ నేతలకు హితవు పలికారు. పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయని అన్నారు.
Mon, Sep 16, 2019, 03:22 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View