మహేశ్ కోసం అనుకున్న కథను రణబీర్ తో చేయనున్న సందీప్ రెడ్డి
Advertisement
తెలుగులో 'అర్జున్ రెడ్డి' సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ఆ తరువాత అదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' టైటిల్ తో చేసి హిట్ కొట్టాడు. దాంతో సందీప్ రెడ్డితో సినిమా చేయడానికి అక్కడి స్టార్ హీరోలు ఆసక్తిని చూపుతున్నారు. వాళ్లలో రణబీర్ కపూర్ తో సినిమా చేయడానికి సందీప్ రెడ్డి సిద్ధమవుతున్నాడు.

ఈ డార్క్ క్రైమ్ స్టోరీకి 'డెవిల్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కొన్నాళ్ల క్రితం మహేశ్ బాబుతో తెలుగులో ఒక సినిమా చేయాలని సందీప్ రెడ్డి అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు అదే కథను సందీప్ రెడ్డి .. రణబీర్ కి చెప్పి ఒప్పించాడని అంటున్నారు. ఈ సినిమాను మరింత బోల్డ్ గా .. రఫ్ గా తీయనున్నట్టు సందీప్ రెడ్డి ముందుగానే చెప్పడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
Mon, Sep 16, 2019, 02:42 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View