ఇది వైసీపీ ప్రభుత్వం చేసిన హత్య: అచ్చెన్నాయుడు
Advertisement
నిబద్ధత కలిగిన నేతను కోల్పోయామని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. ఇది వైసీపీ ప్రభుత్వం చేసిన హత్య అని, కోడెలను వెంటాడి, వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. పలు కేసుల్లో కోడెలకు బెయిల్ వచ్చినా ఆయనపై మళ్లీ కేసులు పెట్టాలని చూశారని, టీడీపీ నేతలను ఎంతో మందిని వెంటాడుతున్నారని ఆరోపించారు. ఇందుకు వైసీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అధికారం, పదవులు శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా వైసీపీ నేతలకు సూచించారు.
Mon, Sep 16, 2019, 02:31 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View