కోడెల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు: సోమిరెడ్డి
Advertisement
కోడెల శివప్రసాద రావు తీవ్ర ఒత్తిడికి గురయ్యారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కోడెల మృతిపై సానుభూతి తెలిపిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోడెల మెడపై గాట్లు ఉన్నాయని చెప్పారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.

కోడెల చనిపోయే వరకూ వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించిందని ఆరోపించారు. ఎవరు తప్పు చేసినా చట్టాలు, కోర్టులు నిర్ణయం తీసుకుంటాయని, ఈ విషయమై ప్రభుత్వ పెద్దలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. వైసీపీ పాలనలో తమ కార్యకర్తలు, నాయకులపై దాడులు జరుగుతున్నాయని, అదే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క రాజకీయదాడి అయినా జరిగిందా? అని ప్రశ్నించారు.

ధైర్యానికి, అభివృద్ధికి మారుపేరు కోడెల 

టీడీపీకి చెందిన మరో నేత కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, రాజకీయ వేధింపులకు కోడెల బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ధైర్యానికి, అభివృద్ధికి మారుపేరు కోడెల అని, ఎన్నో సంక్షోభాలను చవిచూసిన నాయకుడని చెప్పారు.
Mon, Sep 16, 2019, 02:22 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View