నిర్మాతలతో నాకు ఎలాంటి గొడవలు లేవు: దర్శకుడు హరీశ్ శంకర్
Advertisement
మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకులలో హరీశ్ శంకర్ ఒకరు. ఆయన దర్శకత్వం వహించిన 'వాల్మీకి' సినిమా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి మాట్లాడుతూ, తనపై వచ్చిన కొన్ని రూమర్స్ కి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

దిల్ రాజు నిర్మాతగా 'దాగుడుమూతలు' సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాను. అయితే కొన్ని కారణాల వలన అది కుదరలేదు. దిల్ రాజుతో నేను గొడవపడినట్టుగా వార్తలు షికారు చేశాయి. నిజానికి దిల్ రాజుతో పెద్ద గొడవేం జరగలేదు. కాస్టింగ్ విషయంలోనే ఆయనతో ఇబ్బంది. ఇక 'వాల్మీకి' నిర్మాతలైన రామ్ ఆచంట - గోపి ఆచంటలతో విభేదాలు వచ్చినట్టుగా కూడా ప్రచారం జరిగింది. ఇందులోనూ ఎంతమాత్రం నిజం లేదు. వాళ్లు ఖర్చుకు వెనకాడకపోయినా, నేనే నియంత్రణ చేస్తూ వచ్చాను" అని చెప్పుకొచ్చాడు.
Mon, Sep 16, 2019, 02:09 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View