సెల్ఫోన్లతో దొరికిన విద్యార్థులు.. సుత్తితో బద్దలుగొట్టిన ప్రిన్సిపాల్
14-09-2019 Sat 07:40
- కాలేజీకి సెల్ఫోన్లు తీసుకురావడం నిషేధం
- తరగతి గదిలోకి ఫోన్లతో విద్యార్థులు
- ప్రిన్సిపాల్ ఆకస్మిక తనిఖీతో దొరికిన విద్యార్థులు

కళాశాలకు సెల్ఫోన్లతో రావొద్దని ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ విద్యార్థులు వినకపోవడంతో ఓ ప్రిన్సిపాల్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల నుంచి ఫోన్లు లాక్కొని వాటిని సుత్తితో బద్దలుగొట్టారు. కర్ణాటకలోని షిరాడీలో ఓ ప్రైవేటు కళాశాలలో జరిగిందీ ఘటన. క్యాంపస్‌లోకి ఫోన్లు తీసుకురావడంపై నిషేధం ఉన్నా కొందరు విద్యార్థులు అధ్యాపకుల కళ్లుగప్పి రహస్యంగా వాటిని తీసుకొచ్చి ఉపయోగిస్తున్నారు.
విషయం తెలిసిన ప్రిన్సిపాల్ ఆకస్మిక తనిఖీ నిర్వహించడంతో విద్యార్థుల బాగోతం బయటపడింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్ వారి నుంచి సెల్ఫోన్లు తీసుకుని వారి ఎదుటే వాటిని సుత్తితో బద్దలుగొట్టి ధ్వంసం చేశారు.
ADVERTSIEMENT
More Telugu News
చివరి మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన ఆర్సీబీ
40 minutes ago

ఐదు భాషల్లో ఎన్టీఆర్ 30వ చిత్రం... కొరటాల శివ దర్శకత్వం... రౌద్రం ఉట్టిపడేలా స్పెషల్ వీడియో
52 minutes ago

'అఖండ' సీక్వెల్ కథపై జరుగుతున్న కసరత్తు!
1 hour ago
