హైదరాబాద్ లోనే 'సైరా' ప్రీ రిలీజ్ వేడుక

12-09-2019 Thu 12:17

చిరంజీవి కెరియర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రంగా 'సైరా' రూపొందింది. చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. నరసింహా రెడ్డి కర్నూల్ జిల్లా 'రేనాడు' ప్రాంతానికి చెందినవాడు. అందువలన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్నూల్లో జరపాలని అనుకున్నారు.

అయితే ఈ వేడుకకి రానున్న ప్రముఖులందరికీ ప్రయాణం .. 'బస' పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు వున్నాయి. అందువలన హైదరాబాదులోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చేశారనేది తాజా సమాచారం. ఏ రోజున ఈ వేడుకను జరపనున్నారు? .. వేదిక ఎక్కడ? అనే విషయాలను రెండు రోజుల్లో తెలియపరచనున్నారు. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఒక ప్రత్యేకమైన పాత్రలో తమన్నా కనిపించనున్న సంగతి తెలిసిందే.


More Telugu News
Odisha Man sold his wife in Rajasthan for one lakh
ap govt shocks village and ward employees
Pakistan asks TV channels to ban hug scenes Govt odered
Matchboxes to cost Rs 2 from Dec 1
Bathukamma video On burj khalifa
TMC Chief Mamata to visit goa on 28th october
Indian software engineer Anjali dies of gunfire in Mexico
England won the super twelve opener against West Indies
Lokesh condolences Katragadda Babu sudden demise
Telangana covid daily bulletin
Bandla Ganesh met Ganapathi Sachidananda Swami in Mysore
TDP leader Katragadda Babu dies of cardiac arrest
West Indies collapsed for just fifty five runs against England
Whatsapp likely to halt in these old model phones
TDP spokesperson Pattabhi released from Rajahmundry central jail
..more