రేపు వినాయక నిమజ్జనం.. జంటనగరాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకు సెలవు
రేపు గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలు సహా రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. జంట నగరాలు సహా ఆయా జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకూ రేపటి సెలవు వర్తిస్తుందని ప్రకటించారు. అయితే, ఈ నెల 14న రెండో శనివారం రోజున ఆయా జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు పని చేయాలని ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
Wed, Sep 11, 2019, 10:03 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View