'దర్బార్' నుంచి రజనీ మరో పోస్టర్
Advertisement
రజనీకాంత్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో తాజాగా సెకండ్ లుక్ ను వదిలారు.

ఈ పోస్టర్లో రజనీ యాక్షన్ లుక్ ఆకట్టుకునేదిలా వుంది. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఒక ముఖ్యమైన పాత్రలో నివేదా థామస్ కనిపించనుంది. అనిరుధ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను తెలుగులోను విడుదల చేయనున్నారు. 'పేట' సక్సెస్ తరువాత రజనీ .. 'సర్కార్' సంచలన విజయం తరువాత విజయ్ చేస్తోన్న సినిమా కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు వున్నాయి. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
Wed, Sep 11, 2019, 06:43 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View