భారీ రేటుకు విజయ్ 'బిగిల్' సినిమా తెలుగు హక్కులు
Advertisement
హీరో విజయ్ .. దర్శకుడు అట్లీ కుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'తెరి' .. 'మెర్సల్' సంచలన విజయాలను సాధించాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో తాజాగా 'బిగిల్' చిత్రం రూపొందుతోంది. క్రీడా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో విజయ్ సరసన నాయికగా నయనతార కనిపించనుంది.

కల్పాతి అఘోరామ్ నిర్మిస్తోన్న ఈ సినిమాను దీపావళికి భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను మహేశ్ కోనేరు దక్కించుకున్నారు. ఇందుకోసం ఆయన ఫ్యాన్సీ రేటును చెల్లించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేశ్ కోనేరు స్పందిస్తూ ..'బిగిల్' సినిమా తెలుగు హక్కులు మా ఈస్ట్ కోస్ట్ బ్యానర్ కి దక్కడం ఆనందంగా వుంది. ఇందుకు కారకులైన విజయ్ కి .. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. తమిళంతో పాటే తెలుగులోను ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నాము. త్వరలోనే తెలుగు టైటిల్ ను ప్రకటిస్తాము" అని ఆయన చెప్పుకొచ్చారు.
Wed, Sep 11, 2019, 06:21 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View