500 కోట్ల దిశగా పరుగులు తీస్తోన్న 'సాహో'
Advertisement
ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ తెరకెక్కించిన 'సాహో' క్రితం నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజునే రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల్లో 455 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ 12 రోజుల్లో హిందీలో ఈ సినిమా 135 కోట్ల వసూళ్లను రాబట్టేసింది. ఈ ఏడాదిలో హిందీలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల జాబితాలో నిలిచింది.

ప్రభాస్ జోడీగా శ్రద్ధా కపూర్ నటించిన ఈ సినిమాలో, పలువురు బాలీవుడ్ ఆర్టిస్టులు ముఖ్యమైన పాత్రలను పోషించారు. అక్కడ ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడానికి ఇదో కారణమని అంటున్నారు. నైజామ్ వసూళ్ల విషయానికొస్తే, 12 రోజుల్లో 29.05 కోట్లను వసూలు చేసింది. త్వరలోనే ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లోకి చేరనుందని అంటున్నారు. తొలిరోజునే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, రికార్డుస్థాయి వసూళ్లను రాబడుతుండటం విశేషం.
Wed, Sep 11, 2019, 05:58 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View