'అల వైకుంఠపురములో'నుంచి దసరాకి టీజర్
Advertisement
త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ కథానాయకుడిగా 'అల వైకుంఠపురములో' చిత్రం రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది.

త్రివిక్రమ్ పుట్టినరోజైన నవంబర్ 7వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయాలని భావించారు. కానీ తాజాగా ఆ ఆలోచనను విరమించుకున్నారట. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 8వ తేదీన టీజర్ ను వదలాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఒక నెల ముందుగానే టీజర్ ను వదలనుండటం బన్నీ అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయం. గీతా ఆర్ట్స్ - హారిక అండ్ హాసిని వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సంక్రాంతికి విడుదల చేసే ఈ సినిమాలో 'టబు' కీలక పాత్రలో కనిపించనుంది.
Wed, Sep 11, 2019, 05:23 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View