'సైరా' హిందీ వెర్షన్లో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నా: తమన్నా
Advertisement
చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన 'సైరా' కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటించగా, లక్ష్మీ అనే ముఖ్యమైన పాత్రలో తమన్నా కనిపించనుంది.

తాజాగా తమన్నా మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను 'లక్ష్మీ' అనే పాత్రను పోషించాను. ఈ పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఇంతవరకూ నేను చేసిన చెప్పుకోదగిన పాత్రల్లో ఒకటిగా నిలుస్తుంది. ఇప్పుడే ఈ సినిమా హిందీ వెర్షన్ కి గాను నా పాత్రకి డబ్బింగ్ చెప్పడం పూర్తి చేశాను. ఈ పాత్రలో నటించడం నాకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. అందరితో పాటు నేను కూడా ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.  
Wed, Sep 11, 2019, 04:46 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View