'గ్యాంగ్ లీడర్' కొత్త ట్రెండ్ ను సెట్ చేయడం ఖాయం: హీరో కార్తికేయ
Advertisement
నాని తాజా చిత్రంగా ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'గ్యాంగ్ లీడర్' సిద్ధమవుతోంది. ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, విలన్ పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతూ .. "దర్శకుడు విక్రమ్ కుమార్ గారు నాకు ఈ కథను .. నా పాత్రను గురించి చదివి వినిపించారు. నాకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాను.

ఎవరి మాటలనైనా వినేసి నేను ఈ పాత్ర చేయకపోతే నేను ఓ పెద్ద పొరపాటు చేసినట్టు అయ్యేదనే విషయం ఈ సినిమా ప్రివ్యూ చూసిన తరువాత అర్థమైంది. ఈ సినిమాతో విక్రమ్ కుమార్ గారు కొత్త జోనర్ ను క్రియేట్ చేశారు .. కొత్త ట్రెండ్ ను సెట్ చేశారనడంలో అతిశయోక్తి లేదు. 'జెర్సీ'కి మించిన సక్సెస్ ఈ సినిమాతో నానీకి దక్కుతుందనడంలో సందేహం లేదు" అని చెప్పుకొచ్చాడు.
Wed, Sep 11, 2019, 04:12 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View