ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లను చూసే మేమంతా వచ్చాం: సీనియర్ నటుడు గిరిబాబు
Advertisement
కథానాయకుడిగా .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా .. దర్శక నిర్మాతగా గిరిబాబుకి మంచి పేరుంది. అలనాటి హీరోలందరితోను ఆయన కలిసి నటించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఎన్టీఆర్ .. ఏఎన్నార్ ఇద్దరూ తెలుగు చిత్రపరిశ్రమకి రెండు కళ్ల వంటివారు. వాళ్లిద్దరూ మహానటులు .. మహానుభావులు. ఇంకో వంద సంవత్సరాలైనా వాళ్ల ఇమేజ్ ను అందుకునేవారు రారు .. రాలేరు. వాళ్లిద్దరినీ ఆదర్శంగా తీసుకునే చాలామంది చిత్రపరిశ్రమకి వచ్చారు.

కృష్ణ .. శోభన్ బాబు .. హరనాథ్ .. రామకృష్ణ .. మేము .. ఇలా అందరం వాళ్లను స్ఫూర్తిగా తీసుకునే వచ్చాము. నా ముందు తరం వారితోను, నా తరువాత తరాలవారితోను కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. నా తరువాత తరంలో వచ్చిన చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ అంతా కూడా నన్నెంతో గౌరవించేవారు. చిరంజీవికి .. నాకు మధ్య కొంతమంది మనస్పర్థలు సృష్టించారు గానీ, మా ఇద్దరి మధ్యా అవే ప్రేమాభిమానాలు వున్నాయి" అని చెప్పుకొచ్చారు.
Wed, Sep 11, 2019, 03:44 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View