చంద్రబాబు మళ్లీ అవే పాత ట్రిక్కులు ప్లే చేస్తున్నాడు!: విజయసాయిరెడ్డి
Advertisement
తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు గారి వేషాలు చూస్తుంటే దొంగే.. దొంగ.. దొంగ అని గోలపెట్టడంలా ఉంటాయని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు చంద్రబాబు అదే చేశారని సాయిరెడ్డి విమర్శించారు. అందుకే ఏపీ ప్రజలు గూబ గుయ్ మనిపించి బయటకు విసిరేశారని ఎద్దేవా చేశారు.

ఇప్పుడు చంద్రబాబు మళ్లీ పాత ట్రిక్కులే ప్లే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని వ్యాఖ్యానించిన చంద్రబాబు, ఇప్పుడు వాళ్ల కోసమే ఛలో ఆత్మకూరు అంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు మాటలను నమ్మే అమాయకులు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన సాయిరెడ్డి.. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీలను ట్యాగ్ చేశారు.
Wed, Sep 11, 2019, 03:42 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View