ప్రభాస్ అంటే చాలా ఇష్టం: హీరోయిన్ పాయల్ రాజ్ పుత్
Advertisement
ఇటీవల కాలంలో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోన్న కథానాయికగా పాయల్ రాజ్ పుత్ పేరు వినిపిస్తోంది. హాట్ భామగా మంచి మార్కులు కొట్టేసిన ఆమె, వరుస సినిమాలతో దూసుకుపోతోంది. 'వెంకీమామ' .. 'డిస్కోరాజా' సినిమాలతో పాటు ఆమె 'ఆర్ డి ఎక్స్ లవ్' సినిమా కూడా చేస్తోంది. ఈ సినిమా టీజర్లో ఆమె భారీగా అందాలను ఆరబోసి అంతా తన గురించి మాట్లాడుకునేలా చేసింది.

తాజా ఇంటర్వ్యూలో 'ప్రభాస్ .. విజయ్ దేవరకొండలలో మీకు ఎవరు ఎక్కువ హాట్ గా అనిపిస్తారు? ఎవరితో కలిసి నటించాలని వుంది?' అనే ప్రశ్న ఎదురైంది. అందుకు పాయల్ స్పందిస్తూ .. "నాకు ప్రభాస్ అంటే ఎక్కువ ఇష్టం .. ఆయనలో ఏదో స్పార్క్ వుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ .. సహజంగా అనిపించే స్టైల్ అంటే నాకు మరింత ఇష్టం. ఆయనతో కలిసి నటించాలని వుంది' అని చెప్పింది. ఆమె ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి మరి.
Wed, Sep 11, 2019, 02:54 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View