నాకు నిత్యామీనన్ అంటే ఇష్టం: 'ఉండిపోరాదే' హీరోయిన్ లావణ్య
Advertisement
తెలుగు తెరకి 'ఉండిపోరాదే' సినిమాతో కొత్త హీరోయిన్ పరిచయమైంది .. ఆ అమ్మాయి పేరే 'లావణ్య'. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ, లుక్స్ పరంగా .. నటన పరంగా లావణ్య మంచి మార్కులు కొట్టేసింది. తాజా ఇంటర్వ్యూలో లావణ్య మాట్లాడుతూ, "నేను 6వ తరగతి చదువుతున్నప్పుడే శ్రీకాంత్ గారి సినిమా 'అ ఆ ఇ ఈ' సినిమాలోను, ప్రభాస్ 'డార్లింగ్' సినిమాల్లోను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. ఆ తరువాత పూర్తిగా చదువుపైనే దృష్టిపెట్టాను.

'భీమవరం' కాలేజ్ లో బీటెక్ చదువుతూ షార్ట్ ఫిలిమ్స్ చేశాను .. అవి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలోనే 'ఉండిపోరాదే' సినిమాలో చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నాకు మంచి పాత్ర పడింది. నటనకి అవకాశం వున్న ఈ తరహా పాత్రలు చేయడానికి నేను ఆసక్తిని చూపుతాను. మొదటి నుంచి కూడా నాకు నిత్యామీనన్ నటన అంటే ఇష్టం. ఆమె సినిమాలు ఎక్కువగా చూస్తాను. హీరోయిన్ గా ఆమెలా మంచి పేరు తెచ్చుకోవాలని వుంది" అని చెప్పుకొచ్చింది.
Wed, Sep 11, 2019, 01:09 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View