తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి బాధ్యతల స్వీకారం
Advertisement
తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈరోజు ఉదయం బాధ్యతలు స్వీకరించారు. మండలి చైర్మన్‌గా ఆయన ఒక్కరే నామినేషన్‌ వేయడంతో సమావేశాలు ప్రారంభంకాగానే ఆయన ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌,మండలి సభ్యులు కడియం శ్రీహరి తదితరులు తోడ్కొని రాగా, చైర్మన్‌ స్థానాన్ని అధిష్ఠించి, గుత్తా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి గుత్తా అని ప్రశంసించారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడాలని కోరుకున్న బలమైన నేతల్లో గుత్తా ఒకరని కొనియాడారు.
Wed, Sep 11, 2019, 01:09 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View