7 టెర్రర్ లాంచ్ పాడ్ లలో 275 మంది ఉగ్రవాదులను సిద్ధం చేసిన పాకిస్థాన్!
Advertisement
వాస్తవాధీన రేఖ వెంబడి 7 టెర్రర్ లాంచ్ ప్యాడ్ లను సిద్ధం చేసిన పాకిస్థాన్, అందులో చొరబాటుకు సిద్ధంగా 275 మందిని ఉంచిందని తెలుస్తోంది. ఇందులో ఆఫ్గనిస్థాన్, ఫుష్తున్ కు చెందిన ఉగ్రవాదులు కూడా ఉన్నారని నిఘా వర్గాలు పసిగట్టాయి. వీరు ఏ క్షణమైనా సరిహద్దులు దాటి ఇండియాలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారని ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

ఇండియాలో, ముఖ్యంగా కశ్మీర్ లోయలో అశాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా పాక్ ప్రణాళికలు రూపొందిస్తోందని, అందులో భాగంగా ఐఎస్ఐ ఇటీవల ఉగ్రవాద సంస్థలతో ప్రత్యేకంగా చర్చలు సాగించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా, ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు, సాధ్యమైనంత ఎక్కువ మందిని ఉత్తర కశ్మీర్ లోని గురేజ్ ప్రాంతం ద్వారా చొరబాటుకు యత్నిస్తోంది. గురేజ్ ప్రాంతంలో 80, మంచాల్ సమీపంలో 60, కర్నాహ్ లో 50, కరేన్ లో 40,  యూరీ సమీపంలో 20, నౌగామ్ లో 15, రాంపూర్ సమీపంలో 10 మంది ఉగ్రవాదులను ఉంచిన పాక్, అక్కడ ఉగ్ర క్యాంపులను నిర్వహిస్తోందని, వారికి పాక్ సైన్యంలోని ఉన్నతాధికారులు కొందరు స్వయంగా శిక్షణ ఇస్తున్నారని తెలుస్తోంది.
Wed, Sep 11, 2019, 12:57 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View