హారర్ థ్రిల్లర్ గా 'ఆవిరి' .. ఫస్టులుక్ రిలీజ్
Advertisement
నటుడిగా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించే రవిబాబు, దర్శకుడిగాను విభిన్నమైన చిత్రాలనే తెరకెక్కిస్తూ వస్తున్నాడు. మొదటి నుంచి కూడా ఆయన తన సినిమాల టైటిల్ 'అ' అనే అక్షరంతో మొదలయ్యేలా చూసుకుంటూ వస్తున్నాడు. అలా ఆ మధ్య 'అదుగో' అనే సినిమాతో కొత్త ప్రయోగం చేసిన ఆయన, తాజాగా 'ఆవిరి' అనే సినిమా చేశాడు.

ఈ హారర్ థ్రిల్లర్ సినిమా నుంచి తాజాగా ఫస్టులుక్ పోస్టర్ ను వదిలాడు. గ్యాస్ స్టవ్ పై వున్న కుక్కర్ నుంచి ఆవిరి వస్తుండగా, కుక్కర్ పై భాగాన్ని ఓపెన్ చేసుకుని అందులో నుంచి భయపెడుతూ రెండు కళ్లు కనిపించేలా ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. 'ఆవిరి' అనే టైటిల్ కి తగినట్టుగా వదిలిన ఈ ఫస్టులుక్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తించేలా వుంది. అంతా కొత్త వారితో రవిబాబు నిర్మించిన ఈ సినిమాకి, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. గతంలో 'అవును' సినిమాతో విజయాన్ని అందుకున్న రవిబాబుకి, 'ఆవిరి' కూడా సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి.
Wed, Sep 11, 2019, 12:31 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View