విపరీతమైన తలనొప్పి వస్తోందని... 15 మాత్రలు మింగిన మహిళ మృతి!
Advertisement
విపరీతంగా ఉన్న తలనొప్పి నుంచి సత్వర ఉపశమనం పొందాలన్న ఉద్దేశంతో ఒకేసారి 15 మాత్రలు మింగిన మహిళ మృతి చెందింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. మునేషప్ప అనే రోజు కూలీ భార్య అనసూయమ్మ (45) తలనొప్పిగా ఉందని ఇటీవల వైద్యుని వద్దకు వెళ్లడంతో, డాక్టర్ మందులు రాసిచ్చాడు.

విపరీతంగా తలనొప్పి వస్తోందంటూ, ఆమె ఆ మాత్రలన్నీ ఒకేసారి వేసుకుని, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను గమనించిన కుమార్తె శోభ, హుటాహుటిన సమీపంలోని విక్టోరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అసహజ మరణం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Wed, Sep 11, 2019, 12:17 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View