చంద్రబాబు ఇంటి పక్కనుంచి వెళ్లిన జగన్ కాన్వాయ్
Advertisement
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆత్మకూరుకు వెళ్లకుండా ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు ఇంటి పక్కనుంచి ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ వెళ్లింది. తాడేపల్లిలోని తన నివాసం నుంచి కరకట్ట మీదుగా సెక్రటేరియట్ కు జగన్ వెళ్లారు. ఆయన కాన్వాయ్ కి పోలీసులు క్లియరెన్స్ ఇచ్చారు. మరోవైపు చంద్రబాబు నివాసం వద్ద మీడియా హడావుడి నెలకొంది. చంద్రబాబుతో పాటు పలువురు నేతలు, మీడియా ప్రతినిధులు చంద్రబాబు నివాస ప్రాంగణంలోనే ఉన్నారు.
Wed, Sep 11, 2019, 11:54 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View