నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై నెట్టింట ఫుల్ ట్రోలింగ్!
Advertisement
ఇండియాలో వాహన అమ్మకాలు పాతాళానికి పడిపోవడంపై స్పందిస్తూ, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. యువత ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ లను ఆశ్రయిస్తూ, కొత్త వాహనాలు కొనేందుకు ముందుకు రావడం లేదని, అందుకనే వాహన రంగం మందగమనంలో సాగుతోందని ఆమె వ్యాఖ్యానించడం జరిగింది.

నరేంద్ర మోదీ 100 రోజుల పాలన ముగింపు సందర్భంగా మాట్లాడిన ఆమె, ఈ శతాబ్దపు యువత మనస్తత్వం మారిందని అన్నారు. యువత మెట్రో రైళ్లను, క్యాబ్ లను ఆశ్రయిస్తోందని తెలిపారు. నెలనెలా ఈఎంఐలు కట్టాల్సి వస్తుందని భయపడుతున్న యూత్, కార్లను కొనడం లేదని ఆమె వ్యాఖ్యానించిన తరువాత "సే ఇట్ సీతారామన్ తాయి లైక్", "బాయ్ కాట్ మిలీనియల్స్" హ్యాష్ ట్యాగ్ లను వైరల్ చేస్తూ, సీతారామన్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇక నెట్టింట వస్తున్న కామెంట్లను పరిశీలిస్తే...

* యూత్ కు పానీపూరీ ఇష్టం. అందుకే బీహెచ్ఈఎల్ పడిపోయింది.
* నిజమే, సొంత వాహనం ఉంటే డబ్బు దండగే కదా? డబ్బు మిగుల్చుకోవాలి మరి.
* కొత్త వాహన చట్టమా? మజాకా?
* ఓలా, ఉబెర్ అయితే, లైసెన్స్ అవసరం లేదు, పార్కింగ్ కట్టక్కర్లేదు.
* యువత ఉద్యోగం చేయడాన్ని ఇష్టపడక పోవడం వల్లే నిరుద్యోగం పెరిగిందంటారేమో.
* ప్రతిదానికీ యువతను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు?
Wed, Sep 11, 2019, 11:43 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View