'తార'స్థాయిలో అభిమానం.. ప్రభాస్‌ రావాలంటూ సెల్‌టవర్‌ ఎక్కి హల్ చల్!
అభిమానం వెర్రితలలు వేయడం అంటే ఇదే మరి. సినీ హీరోలను అభిమానించడం సర్వసాధారణం.  కొందరు మరికాస్త అడుగు ముందుకు వేసి వారి సినిమాలు రిలీజ్‌ అయినప్పుడు, ఫంక్షన్ల సమయాల్లో హడావుడి చేస్తుంటారు. కొంత చేతి చమురు వదిలించుకుంటారు. కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టిన డబ్బు ఇలా ఖర్చుచేసి తమ అభిమానాన్ని చాటుకునే వారూ ఉన్నారు.

ఇక మరికొందరు మితిమీరిన చేష్టలతో అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇందుకు ఈ వ్యక్తి ఉదాహరణ. తెలంగాణలోని జనగామ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి సెల్‌టవర్‌ చివరికి ఎక్కేశాడు. దూకేస్తానంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. ఇంతకూ ఏమిటి విషయం? అని ఆరా తీస్తే, హీరో ప్రభాస్‌ తన ముందుకు రావాలని, లేదంటే దూకేస్తానని చెప్పడం మొదలు పెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని, అతన్ని కిందకు దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. 
Wed, Sep 11, 2019, 11:25 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View