చిరూ ద్విపాత్రాభినయం చేయడం లేదట!
Advertisement
చిరంజీవి తాజా చిత్రంగా సిద్ధమైన 'సైరా' విడుదలకి ముస్తాబవుతోంది. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తదుపరి సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. చిరంజీవి తదుపరి సినిమాకి కొరటాల దర్శకత్వం వహించనున్నాడు. సామాజిక సందేశంతో కూడిన వినోదభరితమైన కథను ఆయన సిద్ధం చేసుకున్నాడు.

ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఇక ఇద్దరు నాయికల కోసం వచ్చేవారం ఆడిషన్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఒక కథానాయికగా కాజల్ ను తీసుకునే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న సంగతి తెలిసిందే.
Wed, Sep 11, 2019, 11:20 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View