విజయవాడ హోటల్ లో అఖిలప్రియను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఓ హోటల్ ఉన్న ఆమెను పోలీసులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన తనను అడ్డుకోవడంతో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు.

 ఈ సందర్భంగా ఆమెతో పాటు ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా ఉన్నారు. మరోవైపు జగత్ విఖ్యాత్ రెడ్డి గదిని కూడా పోలీసులు సోదా చేశారు. దీనిపై అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛలో ఆత్మకూరుకు టీడీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఆ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ వ్యూహాత్మకంగా అడ్డుకుంటున్నారు. ఇందులో భాగంగానే అఖిలప్రియను నిర్బంధించారు.
Wed, Sep 11, 2019, 10:21 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View