చంద్రబాబు దృష్టిలో నిరుపేదలు వీరే: విజయసాయిరెడ్డి
Advertisement
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో పల్నాడులో ఐదేళ్లు రౌడీ రాజ్యమేలిందని ఆయన అన్నారు. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయనే రచ్చ చేయడం ద్వారా... రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకుండా దొంగల ముఠా కుట్రలు మొదలుపెట్టిందని మండిపడ్డారు.

 యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే చంద్రబాబు ఈ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. పల్నాడులో ప్రశాంతత నెలకొనడం చంద్రబాబుకు ఇష్టం లేదనే విషయం అర్థమవుతోందని చెప్పారు. పేదల జోలికి వస్తే ఊరుకోనని చంద్రబాబు చెబుతున్నారని... ఆయన దృష్టిలో కోడెల శివప్రసాద్, యరపతినేని, చింతమనేని ప్రభాకర్, నారాయణ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, సుజనా చౌదరిలే నిరుపేదలని ఎద్దేవా చేశారు.

నిద్రపట్టనోడు ఇంకా తెల్లారలేదని ఆకాశం వైపు రాళ్లు విసిరాడట. చంద్రబాబు, ఆయన ఎంగిలి మెతుకులు తినే బానిసలు, ఎల్లో మీడియా వ్యవహారం అలాగే ఉంది. ఎలక్షన్లకు 3 నెలల ముందు చేయాల్సిన ‘అతి’నంతా ఇప్పుడే మొదలు పెట్టారు. చిత్తు చిత్తుగా ఓడి 100 రోజులే అయింది బాబు గారూ' అంటూ విజయసాయి విమర్శించారు.
Wed, Sep 11, 2019, 10:05 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View