60 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న కారులో నిద్రపోతున్న డ్రైవర్... వైరల్ అవుతున్న వీడియో!
Advertisement
అది టెస్లాకారు. అందులో ఆటో పైలట్ ఫంక్షన్ కూడా ఉంది. అయినా, ప్రతి 30 సెకన్లకూ ఓసారి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఆ కారును నడుపుతున్న డ్రైవర్ కూడా అప్రమత్తతతో ఉండాలి. అటువంటిది... గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళుతూ, డ్రైవర్  తో పాటు, అతని పక్కన ఉన్న మరో వ్యక్తి కూడా ఆదమరచి నిద్రపోతున్నారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

అమెరికాలోని మసాచుసెట్స్‌ న్యూటన్‌ హైవే మీద ఈ ఘటన జరిగింది. కారులోని డ్రైవర్, ఇంకో వ్యక్తి నిద్రపోతున్న వేళ, పక్కనే ఓవర్ టేక్ చేయబోయేందుకు వచ్చిన మరో కారు డ్రైవర్ వీరిని గమనించి, వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. కారులోని వారిని అలర్ట్ చేయాలని హారన్ మోగించినా, వారు లేవలేదు. వారు నిద్రపోతుండటాన్ని చూసి కంగారుపడిన అతను, "ఎంత అలసిపోయి ఉంటే మాత్రం, ఇలా డ్రైవింగ్‌ చేస్తున్నపుడు నిద్రపోతారా?" అన్న కామెంట్ తో వీడియోను పోస్ట్ చేశాడు.

ఇక ఈ వీడియోపై టెస్లా సంస్థ సైతం స్పందించింది. తమ కార్లలో ఆటోపైలట్‌ ఫంక్షన్‌ ఉందని, అయినప్పటికి డ్రైవర్‌ అప్రమత్తత అవసరమని తెలిపింది. ఏదైనా హైవేపై వెళుతున్న వేళ, స్టీరింగ్‌ పై చేతులు లేకుంటే, నిమిషానికి రెండు సార్లు ప్రమాద సూచనలు వస్తాయని పేర్కొంది.
Wed, Sep 11, 2019, 09:46 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View