'ఆర్డీఎక్స్ లవ్' నుంచి ట్రైలర్ రిలీజ్
Advertisement
తెలుగు తెరను ఈ మధ్య కాలంలో ప్రేమకథలు మరింత ఎక్కువగా పలకరిస్తున్నాయి. అలా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోన్న మరో ప్రేమకథా చిత్రమే 'ఆర్డీఎక్స్ లవ్'. 'హుషారు' ఫేమ్ తేజు కథానాయకుడిగా .. పాయల్ రాజ్ పుత్ కథానాయికగా ఈ సినిమా నిర్మితమైంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీనియర్ నరేశ్ .. నాగినీడు .. ఆదిత్య మీనన్ ముఖ్యమైన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో, సీనియర్ హీరోయిన్ ఆమని ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tue, Sep 10, 2019, 03:25 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View