కులం ఆధారంగా నీవు గొప్పవాడివి కాలేవు: లావణ్య త్రిపాఠి
Advertisement
లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బ్రాహ్మణ మహాసభకు హాజరైన ఆయన ప్రసంగిస్తూ, సమాజంలో బ్రాహ్మణులకు గొప్ప స్థానం ఉందని చెప్పారు. ఇది పరుశురాముడి త్యాగం, తపస్సు కారణంగా ప్రాప్తించిందని తెలిపారు. ఈ కారణం వల్లే సమాజానికి మార్గదర్శకత్వం వహించే కీలక భూమికను బ్రాహ్మణులు పోషిస్తున్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు కురిపించారు.

సినీ నటి లావణ్య త్రిపాఠి కూడా ఓం ప్రకాశ్ బిర్లా వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేసింది. తాను కూడా బ్రాహ్మణ యువతినేనని చెప్పిన లావణ్య... కొందరు బ్రాహ్మణులకు మాత్రమే తాము గొప్ప అనే ఫీలింగ్ ఎందుకు ఉంటుందో అర్థం కావడం లేదని  చెప్పింది. నువ్వు చేసే పనులను బట్టే నువ్వు గొప్పవాడివి అవుతావని... కులం వల్ల కాదని తెలిపింది. ఆ తర్వాత తన ట్వీట్ ను డిలీట్ చేసింది.
Tue, Sep 10, 2019, 01:52 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View