'సిందూరం' సినిమాకి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు: సీనియర్ హీరోయిన్ సంఘవి
Advertisement
తెలుగు తెరపై నిన్నటి తరం కథానాయికగా సంఘవి తనదైన ప్రత్యేక ముద్ర వేసింది. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. "మొదటి నుంచి కూడా నాకు నటనపై ఆసక్తి ఉండేది. తొమ్మిదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ రాసిన తరువాత సెలవుల్లో తమిళంలో 'అమరావతి' చేశాను. ఆ సినిమా నుంచీ బిజీ కావడంతో ఇక పదో తరగతి పూర్తి చేయడం కుదరలేదు.

ఇంతవరకూ 99 సినిమాలు చేశాను .. 100వ సినిమాలో మంచి పాత్ర చేయాలనే ఆశతో ఎదురు చూస్తున్నాను. తెలుగులో నేను చేసిన చిత్రాల్లో 'సిందూరం' అంటే నాకు ఇష్టం. నన్ను ఫ్లైట్ లో చూసిన కృష్ణవంశీ గారు ఈ సినిమాలో హీరోయిన్ గా బుక్ చేశారు. ఒక మంచి ప్రాజెక్టులో భాగం కావాలనే ఉద్దేశంతో ఈ సినిమాకి నేను పారితోషికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కానీ అంతకంటే ఎక్కువ పేరు ప్రతిష్ఠలను ఈ సినిమా నాకు తెచ్చిపెట్టింది" అని చెప్పుకొచ్చారు.
Tue, Sep 10, 2019, 01:25 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View