'ప్రతిరోజూ పండగే' ప్రీ లుక్ రిలీజ్
Advertisement
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'ప్రతిరోజూ పండగే' సినిమా రూపొందుతోంది. రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఒక వైపున పల్లె .. మరో వైపున పట్నం ఈ రెండింటి మధ్య పెనవేసుకున్న బలమైన బంధం ఈ పోస్టర్లో కనిపిస్తోంది.

ఫస్టులుక్ ను రేపు రాత్రి 8 గంటలకి విడుదల చేయనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇంతకుముందు సాయిధరమ్ తేజ్ - రాశి ఖన్నా జంటగా నటించిన 'సుప్రీమ్' భారీ విజయాన్ని సాధించింది. మళ్లీ ఈ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాపై సహజంగానే అందరిలో ఆసక్తి వుంది.
Tue, Sep 10, 2019, 12:54 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View