అఖిల్ జోడీగా పూజా హెగ్డేను చూడలేనట్టే!
Advertisement
అఖిల్ తన తాజా చిత్రాన్ని 'బొమ్మరిల్లు' భాస్కర్ తో చేస్తున్నాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగును జరుపుకుంది. రెండవ షెడ్యూల్ షూటింగుకి ఈ సినిమా టీమ్ రెడీ అవుతోంది. రెండవ షెడ్యూల్లో హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ ను కూడా ప్లాన్ చేసుకున్నారు.

హీరోయిన్ గా పూజా హెగ్డే అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించారు. అయితే డేట్స్ ఖాళీ లేవని ఆమె చెప్పడంతో, సినిమా టీమ్ కొంత నిరాశకి లోనైందట. ఆలస్యంగా ఆమెను సంప్రదించడమే ఇందుకు కారణం. దీంతో కేతికా శర్మను కథానాయికగా తీసుకునే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే టాక్ వినిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.
Tue, Sep 10, 2019, 12:38 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View