'తాజ్ మహల్' సినిమాలో అలా అవకాశం వచ్చింది: సీనియర్ హీరోయిన్ సంఘవి
Advertisement
తెలుగు తెరపై నిన్నటి తరం అందాల కథానాయికల జాబితాలో సంఘవి కూడా కనిపిస్తుంది. తెలుగుతో పాటు తమిళ .. కన్నడ సినిమాల్లో ఆమె మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అలాంటి సంఘవి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన కెరియర్ గురించిన విషయాలను ప్రస్తావించింది.

"నా అసలు పేరు కావ్య .. తమిళంలో అజిత్ సరసన నేను తొలి సినిమాగా 'అమరావతి' చేశాను. ఆ సినిమా నిర్మాత కూతురు పేరు సంఘవి. ఆ పేరుతో ఆయన నన్ను పరిచయం చేశారు. ఆ తరువాత తెలుగులో వచ్చిన 'యమలీల' సినిమాను తమిళంలో రీమేక్ చేయగా 'ఇంద్రజ' పాత్రలో నేను చేశాను. ఆ సినిమా షూటింగు చేస్తుండగా, తెలుగులో 'తాజ్ మహల్' చేసే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా హిట్ కావడంతో నాకు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత శ్రీకాంత్ జోడీగా ఆరు .. ఏడు సినిమాలు చేశాను" అని చెప్పుకొచ్చింది.
Tue, Sep 10, 2019, 11:41 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View