రాజ్ తరుణ్ కొత్త సినిమాకి టైటిల్ ఖరారు
Advertisement
రాజ్ తరుణ్ కెరియర్ ఆరంభంలో చాలా దూకుడు చూపించాడు. యువ కథానాయకులతో పోటీపడుతూ చకచకా సినిమాలు చేసేశాడు. అయితే వరుసగా ఫలితాలు నిరాశ పరుస్తూ ఉండటంతో, కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కోసం కొంత గ్యాప్ తీసుకున్నాడు. టీనేజ్ లవ్ స్టోరీస్ కి ప్రాధాన్యతనిస్తూ కొన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా ఆయన దర్శకుడు విజయ్ కుమార్ కొండాకు ఓకే చెప్పాడు.

కె.కె. రాధామోహన్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తాజాగా టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకి 'ఒరేయ్ బుజ్జిగా' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా ఈ రోజున ప్రకటించారు. ఈ రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టారు. మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. దర్శకుడు విజయ్ కుమార్ కొండా గతంలో 'గుండెజారి గల్లంతయ్యిందే' తో హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Tue, Sep 10, 2019, 11:07 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View