ధ్రువ - రష్మిక జంటగా 'పొగరు' .. షూటింగ్ పూర్తి
Advertisement
తెలుగుతో పాటు తమిళంలోనూ కథానాయికగా రష్మిక బిజీ అవుతోంది. ఇక తనని హీరోయిన్ ను చేసిన తన మాతృభాష కన్నడలోను ఆమె వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. అలా తాజాగా ఆమె కన్నడలో ధ్రువ హీరోగా చేస్తోన్న 'పొగరు' సినిమాలోను నటిస్తోంది. హీరో ధ్రువ .. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు అనే సంగతి తెలిసిందే.

ధ్రువ హీరోగా 'పొగరు' కొన్ని రోజులుగా హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. నంద కిషోర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో, 'భైరవ గీత' ఫేమ్ ధనుంజయ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్స్ తో హీరో తలపడే క్లైమాక్స్ ఈ సినిమాకి హైలైట్ అవుతుందని అంటున్నారు. కన్నడతో పాటు తెలుగు .. తమిళ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Tue, Sep 10, 2019, 10:53 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View