'చాణక్య'గా దుమ్మురేపేస్తోన్న గోపీచంద్
Advertisement
తెలుగు తెరపై యాక్షన్ హీరోగా గోపీచంద్ కి మంచి పేరుంది. ఆయన హైట్ .. పర్సనాలిటీ .. డైలాగ్ డెలివరీ యాక్షన్ పాత్రలకి సరిగ్గా సరిపోతాయి. అందువలన ఆయన కూడా ఈ తరహా పాత్రలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతుంటాడు. అలా తన తాజా చిత్రమైన 'చాణక్య'లో ఆయన 'రా' ఏజెంట్ గా చేస్తున్నాడు.

'తిరు' దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను వదిలారు. తీవ్రవాదానికి .. దేశభక్తికి సంబంధించిన విజువల్స్ పై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో గోపీచంద్ జోడీగా మెహ్రీన్ కనిపించనుంది. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో, జరీన్ ఖాన్ కీలకమైన పాత్రలో కనిపించనుంది. కొంతకాలంగా సక్సెస్ కోసం గోపీచంద్ చేస్తోన్న నిరీక్షణ ఈ సినిమాతో ఫలిస్తుందేమో చూడాలి.
Mon, Sep 09, 2019, 05:37 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View