కార్తికేయ '90 ML' మూవీ ఫస్టులుక్ ఇదే
Advertisement
కార్తికేయ తాజా చిత్రంగా '90 ML' సినిమా రూపొందుతోంది. అశోక్ గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ సినిమాకి శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను వదిలారు. టైటిల్ కి తగినట్టుగానే మత్తు పానీయాల సీసాలపై కాలుమీద కాలేసుకుని పడుకున్న కార్తికేయ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు.

జీవితాన్ని 'ఫుల్' గా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఆయన ఎక్స్ ప్రెషన్ ను బట్టి తెలుస్తోంది. ఈ పోస్టర్ ను బట్టి ఇది యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సినిమా అనే విషయం అర్థమవుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఇక కార్తికేయ విలన్ గా నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమా, ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విలన్ గా ఆయన ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి మరి.
Mon, Sep 09, 2019, 05:17 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View