నాగ్ అశ్విన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ
Advertisement
తెలుగు యువ కథానాయకులలో విజయ్ దేవరకొండకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఆయన క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రాజెక్టు వుండనుందనే విషయం రీసెంట్ గా బయటికి వచ్చింది. ఈ సినిమాకి 'ఫైటర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా చెప్పుకున్నారు.

ఆ తరువాత సినిమాను నాగ్ అశ్విన్ తో విజయ్ దేవరకొండ చేయనున్నాడనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. నాగ్ అశ్విన్ పేరు వినగానే ఆయన దర్శకత్వం వహించిన 'మహానటి' గుర్తుకు వస్తుంది. అంతకుముందు ఆయన చేసిన 'ఎవడే సుబ్రమణ్యం' ద్వారానే విజయ్ దేవరకొండ కెరియర్ కి పునాది పడింది. 2015లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి ఈ కాంబినేషన్ మరోసారి సెట్స్ పైకి వెళుతోంది. ఆల్రెడీ కథను లాక్ చేయడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతుందని చెబుతున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
Mon, Sep 09, 2019, 03:48 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View