శేఖర్ కమ్ములతో సెట్స్ పైకి వచ్చేసిన చైతూ, సాయిపల్లవి
Advertisement
'ఫిదా' బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొత్త హీరోహీరోయిన్లతో ఒక సినిమా చేయాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేశాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. దాంతో ఆయన మరో కథను సిద్ధం చేసుకుని, చైతూ - సాయిపల్లవి జంటగా రూపొందించడానికి రంగంలోకి దిగిపోయాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావడంతో, హైదరాబాదులో ఈ రోజున రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

నాయకా నాయికల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. శేఖర్ కమ్ముల కథలు లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను కలుపుకుని ఉంటాయి. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ సినిమా కూడా అదే తరహాలో సాగనుందని అంటున్నారు. నారాయణ దాస్ కె.నారంగ్, రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా గురించి త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
Mon, Sep 09, 2019, 03:26 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View