హీరోయిన్స్ తో క్లోజ్ గా వుంటాను .. అందుకే ఈ పుకార్లు: హీరో సాయిధరమ్ తేజ్
Advertisement
కథల విషయంలో సాయిధరమ్ తేజ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి, కాస్త ఆలస్యమైనా తనని మరో మెట్టు పైకి ఎక్కించే సినిమాలు చేయాలనే పట్టుదలతో వున్నాడు. కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ యువ దర్శకుల కథలను వింటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనపై వచ్చే పుకార్లను గురించి స్పందించాడు.

"సినిమాల్లోకి రావడానికి ముందే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. కానీ ఆ ప్రేమకి బ్రేకప్ జరిగిపోయింది .. ఆ అమ్మాయికి వేరెవరితోనో పెళ్లి జరిగిపోయింది. నేను సినిమాల్లోకి వచ్చిన తరువాత ఫలానా హీరోయిన్ తో ప్రేమలో పడ్డానంటూ పుకార్లు షికారు చేశాయి. ఇప్పటికీ నాపై ఈ పుకార్లు వస్తూనే వున్నాయి. నేను సినిమా చేసే ప్రతి హీరోయిన్ తోను క్లోజ్ గానే వుంటాను. రాశి ఖన్నా .. రకుల్ .. రెజీనా వీళ్లంతా ఆ జాబితాలోనే కనిపిస్తారు. అందువలన వాళ్లతో లవ్ లో పడ్డానంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. నిజానికి మేమంతా మంచి స్నేహితులం. నా పెళ్లితో ఈ పుకార్లకు తెరపడుతుందేమో. కెరియర్ పరంగా సెటిల్ కాగానే పెళ్లి చేసేసుకుంటాను" అని చెప్పుకొచ్చాడు.
Mon, Sep 09, 2019, 02:57 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View