'సరిలేరు నీకెవ్వరు'లో మెరవనున్న తమన్నా
Advertisement
మహేశ్ బాబు కథానాయకుడిగా దర్శకుడు అనిల్ రావిపూడి 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చేస్తున్నాడు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన నాయికగా రష్మిక మందన నటిస్తోంది. ఈ సినిమాలోని ఒక పాటలో మహేశ్ సరసన తమన్నా మెరవనుందనేది తాజా సమాచారం.

అయితే ఇది ఐటమ్ సాంగ్ కానీ .. స్పెషల్ సాంగ్ గాని కాదట. మహేశ్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్ అని అంటున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు పాత్ర రీత్యా ఇంట్రడక్షన్ సాంగ్ లో ఆయన స్టెప్స్ వేయకుండా హుందాగా వ్యవహరించవలసి ఉంటుంది. అందువలన ఆయన హుందా తనాన్ని కాపాడుతూ, ఆ పాటలో తమన్నా వయ్యారాలు ఒలకబోస్తూ స్టెప్స్ వేసేలా ప్లాన్ చేశారట. ఇందుకుగాను తమన్నాకి పారితోషికంగా పెద్దమొత్తమే ముడుతుందని అంటున్నారు. ఈ ఇంట్రడక్షన్ సాంగ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు.
Mon, Sep 09, 2019, 02:22 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View