'గద్దలకొండ గణేశ్' గా వరుణ్ తేజ్
Advertisement
వరుణ్ తేజ్ తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. అలా కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ తాజాగా ఆయన చేసిన చిత్రమే 'వాల్మీకి'. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు.

పోస్టర్స్ లో ఆయన గెటప్ చూసిన వాళ్లంతా ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు ఏదై ఉంటుందా అనే ఆత్రుతను కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పాత్ర పేరు 'గద్దలకొండ గణేశ్' అనే విషయాన్ని వరుణ్ తేజ్ బయటపెట్టాడు. ఈ పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాడు. ఈ నెల 20వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో ఒక కథానాయికగా పూజా హెగ్డే, మరో కథానాయికగా మృణాళిని రవి నటించారు. తమిళ హీరో అధర్వ మురళి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనుండటం విశేషం.
Mon, Sep 09, 2019, 12:23 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View