400 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'సాహో'
Advertisement
'బాహుబలి' తరువాత ప్రభాస్ కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన 'సాహో' .. క్రితం నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నాలుగు భాషల్లో అత్యధిక థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా, కథాకథనాల పరంగా అంచనాలను అందుకోలేకపోయింది. అయితే 'బాహుబలి'తో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ పెంచుకున్న క్రేజ్, వసూళ్ల పరంగా ఈ సినిమాకి కలిసొచ్చింది.

భారీ ఓపెనింగ్స్ తో అనేక ప్రాంతాల్లో కొత్త రికార్డులను సృష్టించిన 'సాహో' .. 10 రోజుల్లో 400 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. తొలి రోజునే నెగెటివ్ టాక్ వచ్చినా, నాలుగు భాషల్లో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషం. లాంగ్ రన్ లో ఈ సినిమా 500 కోట్ల మార్క్ ను చేరుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ తదుపరి సినిమాగా 'జాన్' రూపొందుతోన్న సంగతి తెలిసందే.
Mon, Sep 09, 2019, 12:01 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View