'గ్యాంగ్ లీడర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఖరారు
Advertisement
నాని కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' రూపొందింది. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమా ద్వారా ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా పరిచయమవుతోంది. ఈ నెల 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్లాన్ చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వైజాగ్ వేదిక కానుంది.

ఈ నెల 10వ తేదీన అక్కడ ఈ వేడుకను నిర్వహించనున్నారు. వైజాగ్ లోని 'గురజాడ కళాక్షేత్రం'లో ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకను జరపనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కు .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాతో నానికి మరో మంచి హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. 'గ్యాంగ్ లీడర్'తో తెలుగు చిత్రపరిశ్రమలో నిలదొక్కుకోవాలనే ప్రియాంక ఆశ నెరవేరుతుందేమో చూడాలి.
Mon, Sep 09, 2019, 11:46 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View