నాగార్జున ఎడమ చేతిపై స్నేక్ టాటూ.. విషయాన్ని వివరించిన నాగ్!
Advertisement
హీరో నాగార్జున ప్ర‌స్తుతం బిగ్‌ బాస్ మూడవ సీజన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఎలిమినేషన్ ఎపిసోడ్ సందర్భంగా నేచుర‌ల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్ గా హాజరైన వేళ, నాగ్ ఎడమ చేతిపై ఉన్న ఓ పెద్ద టాటూ గురించిన ప్రస్తావన వచ్చింది. తన చేతిపై కొత్త టాటూను నాగ్ వేయించుకున్నార‌ని చెబుతూ దాన్ని చూపించకుండా దాస్తున్నారని నాని ఆరోపించాడు. ఇదే సమయంలో హౌస్ లోని కంటెస్టెంట్స్ సైతం దాని గురించి అడగడంతో, నాగ్ తన టాటూను చూపించాడు. ఓ పెద్ద పాము, దానిపైన కంపాస్ ఉన్నాయి. దాని అర్థం ఏమిటని అడగటంతో, నాగ్ వివరించాడు.

నాగుపామును చూస్తే అందులో తన పేరు ఉందన్న విషయం అందరికీ తెలుస్తుందని చెప్పిన నాగ్, కంపాస్ లో కనిపించే కన్ను తనదేనని, దీనిపైనున్న 'ఎన్' అనే అక్షరం నార్త్ అన్న పదంతో పాటు నాగార్జున అని కూడా సూచిస్తుందని అన్నారు. పాము ద‌గ్గ‌రున్న చుక్క‌లకు అర్థం చెబుతూ, నాగులు కుబుసం విడిచి పెట్టిన‌ట్టు తాను కూడా గ‌తాన్ని ఎప్పటికప్పుడు మరచిపోయి, కొత్త విష‌యాల‌ను తెలుసుకుంటుంటాననడానికి ఈ టాటూ అర్థమని అన్నారు.
Mon, Sep 09, 2019, 11:36 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View